రామాలయం చుట్టుపక్కల మద్యం బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలని తాసిల్దార్ కి వినతి.

దక్షిణ అయోధ్యగా పిలవబడుతున్న ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం పరిసర ప్రాంతాలలో మద్యం షాపుల నిర్వాహకులు అక్రమ మద్యం బెల్ట్ షాపులు ఏర్పాటు చేసుకొని మధ్యాహ్నం విక్రయించడం ద్వారా మద్యం సేవించిన వ్యక్తుల వల్ల రామాలయం దర్శనానికి వచ్చే భక్తులు, సందర్శకులు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. మద్యం మత్తు లో దర్శనానికి వెళుతున్న వారిని ఆటంకం పరుస్తూ ఇబ్బందులు పెడుతున్నారని, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు, సందర్శకులు భద్రాద్రి శ్రీ సీతారాముల వారిపైన ఉన్న భక్తితో మద్యం నిర్వాహకులను ఏమనలేని దుస్థితి వచ్చిందని తెలిపారు. ప్రభుత్వ అధికారులు శ్రీ సీతారామచంద్ర దేవస్థానం రామాలయం చుట్టుపక్కల సూపర్ మార్కెట్ బజార్, గ్రామపంచాయతీ కార్యాలయం ప్రక్కన, అక్రమంగా మద్యం బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని మద్యం బెల్ట్ షాపులను భక్తులకు సందర్శకులకు ఇబ్బంది లేకుండా తొలగించాలని స్థానిక తహసిల్దార్ కి ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు అలవాల రాజా వినతి పత్రం సమర్పించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు