పాల్గొన్న స్థానిక సర్పంచ్ పూనెం కృష్ణ.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో: భద్రాచలం:
మే 13: టుడే 9 ప్రతినిధి
ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధితోపాటు ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించేందుకు సహకరిస్తానని భద్రాచలం సర్పంచ్ పూణేం కృష్ణ అన్నారు. బుధవారం నాడు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్)లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మూడవ రోజు విద్యార్థులకు ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధి తదితర అంశాలపై నిర్వహించిన కార్యక్రమంలో ఏడవ వార్డు సభ్యుడు కావూరి గోపితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టడంతో పాటు తమ నైపుణ్యాలను కూడా అభివృద్ధి చేసుకోవాలని అన్నారు.

అనంతరం ఏడవ వార్డు సభ్యుడు కావూరి గోపి మాట్లాడుతూ తాను కూడా ఇదే కళాశాలలో చదివిన విద్యార్థిని, కళాశాల అభివృద్ధిలో మీతో కలిసి పని చేస్తానని ఆయన పేర్కొన్నారు. కళాశాల అభివృద్ధికి ఏ సహాయం కావాలన్నా మమ్మల్ని సంప్రదిస్తే తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. జాన్ మిల్టన్ సర్పంచ్ పూనెం కృష్ణ, 7వ వార్డు సభ్యుడు కావూరి గోపిని మొమెంటోలు మరియు శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.









