•నీట్ పేపర్ లీకేజీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎస్ఎఫ్ఐ డిమాండ్.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో: భద్రాచలం:
మే 13 : టుడే 9 ప్రతినిధి
కేంద్ర ప్రభుత్వం వైఫల్యంతోనే నీట్ పరీక్ష రద్దయి 22 లక్షల మంది విద్యార్థుల ఆశలు నిరాశలయ్యాయని ఎస్ఎఫ్ఐ టౌన్ సెక్రెటరీ కొప్పుల రవీంద్ర అన్నారు. దేశంలో పరీక్షల నిర్వహణను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రల హక్కులను హరించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి పరీక్షలు నిర్వహణ ఇవ్వడంతో పారదర్శకత లోపించి వరుసగా పేపర్ లీక్ అవుతున్నాయని పేర్కొన్నారు. గతంలో 2024 లో జరిగిన నీట్ నెట్ పరీక్షల పేపర్ లీకులకు కారణంగా పరీక్షలు రద్దు అయి వాటినీ మళ్లీ వరుసగా పేపర్ లీకులు జరగడంతో విద్యార్థులు తల్లిదండ్రులు తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. నేటి పరీక్షలకు అత్యధిక పేద మధ్యతరగతి విద్యార్థిని విద్యార్థులు ఎంతో ఆశతో హాజరై తమ భవిష్యత్తుపై కలలుగంటున్న సమయంలో పేపర్ లీక్ పేరుతో రద్దు చేయడం దుర్మార్గమని అన్నారు. దీనికి కారుకులైన వారిని కఠినంగా శిక్షించాలని ఎస్ఎఫ్ఐ గా డిమాండ్ చేశారు. వైద్య విద్యార్థుల జీవితాలతో చలగాటమాడుతున్న బిజెపికి విద్యార్థులు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. మళ్లీ వరుసగా పేపర్ లీకులు జరగకుండా చూసుకోవాలని ఒక రాష్ట్రంలో పేపర్ లీక్ అయితే దేశవ్యాప్తంగా విద్యార్థులు నష్టపోతారని తెలిపారు. అందుకే విద్య వికేంద్రీకరణ చేయాలని కొప్పుల రవీందర్ డిమాండ్ చేశారు. రాష్ట్రాల జాబితాలోనే ఉన్న విద్యా హక్కులను కేంద్రం లాక్కొని కేంద్రీకరణ వలన అనేక మంది విద్యార్థులు నష్టపోతారని తెలిపారు.తక్షణమే నీట్ పేపర్ లీకేజీ పై సమగ్రమైన విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేసే తక్షణమే కేంద్రం స్పందించాలని కొప్పుల రవీందర్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ సమర్థత పరీక్షలు నిర్వహణలో ఒక్క విద్యార్థి నుంచి 2 లక్షల వరకు వసూలు చేసి వేల కోట్ల రూపాయల అక్రమ వసూలు జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. అని తెలిపారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నీట్ పరీక్షలు పదేపదే లీక్ అవ్వడం వల్ల కేంద్ర ప్రభుత్వం నిర్వహణ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం కోల్పోతుందని అన్నారు. ఈ ఘటన లక్షలాదిమంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు కారణమైందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావతం కాకుండా కేంద్రం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కొప్పుల రవీందర్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సురేష్, నాగేష్ ,బన్నీ సాయి, తరుణ్ ,విగ్నేష్ ,రవి ,వెంకటేశ్వర్లు, సతీష్ ,రమేష్ ,కుమార్, వేణు, నందు, తదితరులు పాల్గొన్నారు.









