ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ గా ఇద్దామనుకున్నాడు. డబ్బుల కోసం ఏదైనా చేయాలి అనుకున్నాడు చివరకు ఆ యువకుడు అడ్డంగా బుక్కయ్యాడు . వివరాల్లోకి వెళితే…
తెలంగాణ EAGLE ఫోర్స్, వైరా పోలీసులు వైరా రింగ్ సెంటర్ సమీపంలో బైక్ పై సర్రున దూసుకు వస్తున్న 21 ఏళ్ల మిత్ర చైతన్య, 20 ఏళ్ల హేమలతను అడ్డుకోబోగా . వారు తప్పించుకునే క్రమంలో పల్సర్ బైక్‌తో పోలీసులను ఢీకొట్టడంతో వైరా ఎస్సై గాయపడ్డారు..
పోలీసులు చాకచక్యంతో వ్యవహరించి వారిని అదుపులోకి తీసుకొని విషయం రాబట్టగా ,ప్రియురాలి పుట్టినరోజుకు ఐఫోన్ గిఫ్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
ఒడిశా నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న రూ.6 లక్షల విలువైన 12 కిలోల గంజాయిని పోలీసులు వారి నుండి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విక్రయించి వచ్చిన డబ్బుతో పుట్టినరోజు కానుకగా ఐఫోన్ కొనాలని భావించినట్లు విచారణలో ఆ జంట తెలియజేశారు.
ఇది ఇలా ఉంటే మిత్ర చైతన్యపై గతంలోనే మూడు NDPS కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కొన్ని నెలల క్రితమే జైలు నుంచి విడుదలైన అతడు మరోసారి గంజాయి స్మగ్లింగ్ కేసులో పట్టుబడడం గమనార్హం .









