ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం తుమ్మల నాగేశ్వరరావు వద్దీపేట చెక్ డ్యాం,మంజూరు చేయాలి.CPIML న్యూడెమోక్రసీ.


చర్ల. 05…. TODAY 9…D వినేష్… భద్రాద్రి డివిజన్ ప్రతినిధి…

గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరావు చర్ల మండలంలోని వద్దిపేట చెక్ డాం మంజూరు చేయాలని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఒక ప్రకటనలో కోరింది ,

తాలిపేరు ప్రాజెక్ట్ ఎడమకాల ద్వారా ఒక పంట మాత్రం నీళ్లు అందుతున్నాయని,అధికారంలోకి రాకముందు వద్దిపేట చెక్ డ్యాం ద్వారా ఎత్తిపోతల పధకం ద్వారా 25000ఎకరాలకు రెండు పంటలకు నీళ్లు అందిస్తానని ఇచ్చిన హామీ నిలుపుకోవాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ ముసలి సతీష్ డిమాండ్ చేశారు.


వద్దిపేట చెక్ డ్యాం నిర్మాణం ద్వారా ఎత్తిపోతల పథకం కింద 25వేల ఎకరాల భూముల పంటలుపండించవచ్చని దీనితో రైతులకు మేలు జరుగుతుందని పేద ప్రజలకు కూలి దొరుకుతుందని అభిప్రాయపడ్డారు . ఏజెన్సీ ప్రాంతంలో డిగ్రీ కాలేజ్ లేకపోవడం వలన దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవడానికి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఏజెన్సీ ఆదివాసీలకు అనేక హామీలు ఇచ్చి విస్మరించారని గుర్తు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఓడ దాటకముందు ఓడ మల్లయ్య,వాడ దాటినంక బోడి మల్లయ్య లెక్క ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు.

సీతారామ ప్రాజెక్టు కారణంగా కోరగడ్డ భూములు పదివేల ఎకరాలు నీట మునుగుతున్నాయని,తాతల కాలం నుండి కొత్తపల్లి, లింగాపురం, గొంపల్లి,కొత్తూరు, మొగలపల్లి, ఆనంద కాలనీ, ఏడు గ్రామాల ప్రజలు కూరగడ్డ భూముల మీదనే వ్యవసాయం చేసుకొని ఆధారపడి బతుకుతున్నారని,వాటికి తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని అన్నారు అంతేకాకుండా రాజ్యాంగంలో ఏజెన్సీలు మొత్తం ఆదివాసీల హక్కుల అని చెప్తున్నటువంటి చట్టాలు ఈరోజు కొయ్యూరు మామిడిగూడెం గడ్డురుగట్టు భూములు ఫారెస్ట్ వారు ఆక్రమించుకుంటే కనీసం పట్టించుకునే పరిస్థితిలో ఈ పాలకులు లేరని పైగా ఆదివాసీలే అడవికి మూలం అని చెబుతున్న చట్టాలు ఉల్లంఘించి ఆదివాసీల మీదనే కేసులు నమోదు చేస్తున్న దౌర్భాగ్య పరిస్థితి ఈ ఏరియాలో ఉంది అని ఆయన అన్నారు. పాతపోడు భూములలో సాగులో ఉన్న రైతులకు పట్టాలు ఇవ్వాలని ఆదివాసీలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని కోరారు.

.
ఈ కార్యక్రమంలో ఏఐటిఎఫ్ ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం జిల్లా నాయకులు గొంది మూయన్న, ఇరుప ప్రసాద్, బొర్రా సరోజిని, కొండ్రు రాజేశ్వరి, బంద నాగమణి, తెల్లం బుచ్చయ్య, తెల్లం రామకృష్ణ, తెల్లం కమల తదితరులు పాల్గొన్నారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు