బ్లాక్ మనీ మోసం భాగోతం బయటపెట్టిన పోలీసులు | రూ.13 లక్షలు వసూలు చేసిన నిందితుడు అరెస్ట్

DSP R. సతీష్ కుమార్, పాల్వంచ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్

ఆగష్టు 4

అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో బ్లాక్ మనీ పేరుతో అమాయకులను మోసం చేస్తున్న పత్తిపాటి ప్రేమ్ చందు అనే నిందితుడిని అశ్వారావుపేట పోలీసులు అరెస్ట్ చేశారు.

బ్లాక్ పేపర్లను ప్రత్యేక రసాయన ద్రావణంలో ముంచితే రూ.500 నోట్లుగా మారుతాయని నమ్మించి, అశ్వారావుపేటకు చెందిన మదుబాబు నుండి ముందుగా రూ.11 లక్షలు, అనంతరం రసాయనాల కొనుగోలు పేరుతో మరో రూ.2 లక్షలు తీసుకుని మొత్తం రూ.13 లక్షలు మోసం చేసినట్లు ఒప్పుకున్నాడు.

నిందితుడి వద్ద నుండి మోసానికి ఉపయోగించిన రూ.500 నోట్ల పరిమాణంలో కట్ చేసిన 20,000 బ్లాక్ పేపర్లు (20 కట్టలు), బ్లాక్ పేపర్లను నోట్లుగా మారుస్తామని చెప్పందుకు ఉపయోగించిన 2 రసాయన ద్రావణాల సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసు వివరాలను పాల్వంచ DSP R. సతీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో వెల్లడించారు. నిందితుడిపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి, స్వాధీనం చేసుకున్న వస్తువులను సీజ్ చేసి రిమాండ్ కు తరలించారు.

నిందితుడు గతంలో కూడా నకిలీ కరెన్సీ, మోటార్ సైకిల్ దొంగతనం వంటి కేసుల్లో బాచుపల్లి, రామచంద్రపురం, కూకట్పల్లి పోలీస్ స్టేషన్లలో నిందితుడిగా ఉండి జైలుకు వెళ్లి వచ్చినట్లు విచారణలో తెలిసింది

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు