శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు …

భద్రాచలం… TODAY 9….

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు పరిశీలించారు. ఈ సందర్భంగా విస్తా కాంప్లెక్స్, కరకట్ట డ్రైనేజీ స్లూయిస్‌లను సందర్శించి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.

పనులు నాణ్యతతో పాటు నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. అనంతరం విస్తా కాంప్లెక్స్‌లో ఉన్న షాపులను తొలగించాల్సి ఉందని అధికారులు తెలియజేయగా, అక్కడి వ్యాపారులు ఎమ్మెల్యేను కలిసి పుష్కరాల సమయంలో తమకు ప్రత్యామ్నాయంగా వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, వ్యాపారులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ స్థలం కేటాయించే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో భద్రాచలం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పూనెం కృష్ణ , పంచాయతీ కార్యదర్శి సి.హెచ్. శ్రీనివాసరావు , దేవస్థానం కార్యనిర్వహణాధికారి దామోదర్ , ఇరిగేషన్ ఈఈ, పోలీసు అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు