భగవద్గీత పద్మనాభ ముఖ కమలం నుండి వెలువడిందని వివరిస్తూ ప్రతి హిందువు భగవద్గీతను పారాయణం చేయాలనే సంకల్పంతో తొలి ఏకాదశి సందర్భంగా భద్రాచలంలోని శ్రీకృష్ణ దేవాలయంలో మొట్టమొదటి సారిగా భగవద్గీతమహా యజ్ఞం ఎంతో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అర్చక దంపతులు కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఈ కార్యక్రమమునకు వరదా నాగలక్ష్మి సంకల్పం చేయగా రాజశ్రీ సహకరించి కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. భగవద్గీత పారాయణం వరదా నాగలక్ష్మి ఆధ్వర్యంలో పిల్లలచే నిర్వహించబడింది కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆలయ కమిటీ వారు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు .ఈ కార్యక్రమం తవిడిశెట్టి నాగలక్ష్మి ఆధ్వర్యం లో జరిగినట్టు నిర్వాహకులు తెలియజేశారు.
Post Views: 32









