భద్రాచలం… Today 9 డివిజన్ ప్రతినిధి… D వినేష్
ఆంధ్రాలోని మారేడుమిల్లి నుంచి భద్రాచలం మీదుగా బెంగళూరుకు కారులో తరలిస్తున్న 101 కేజీల ఎండు గంజాయిని ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బంది పట్టుకున్నారు. కూనవరం రోడ్డులో వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక కారులో అనుమానాస్పదంగా వెళుతున్న వారిని పరిశీలించగా కారులో 101 కేజీల గంజాయి దొరికినట్లు తెలిపారు. పట్టుబడిన వారిలో ముగ్గురు బెంగళూరుకు చెందిన వ్యక్తులుకాగా మరొకరు అనంతపురం కు చెందిన వ్యక్తిగా పేర్కొన్నారు.నిందితులను విచారించగా మారేడుమిల్లిలో తక్కువ ధరకు గంజాయిని కొని భద్రాచలం మీదుగా హైదరాబాద్ చేరుకొని అక్కడి నుంచి కర్ణాటకలోని బెంగళూరుకి తరలించే క్రమంలో పట్టుబడినట్లు తెలిపారు. గంజాయి విలువ సుమారు 56 లక్షలు ఉంటుందని అన్నారు. గంజాయితోపాటు గంజాయి రవాణా చేస్తున్న నలుగురు వ్యక్తులను కారును పట్టుకొని కారును గంజాయిని, ఐదు చరవాణిలను, సీట్ చేసి ఆ నలుగురిని రిమాండ్ కు తరలించినట్టు తెలిపారు.









