కొత్తగూడెం అర్బన్, జులై 16 (TODAY 9) :
ఉప ముఖ్యమంత్రి, మంత్రుల పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన “చలో మణుగూరు” పిలుపునకు భయపడి కొత్తగూడెం నియోజకవర్గంలోని బీఆర్ఎస్ ముఖ్య నాయకులను ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో నిర్భందించడాన్ని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తీవ్రంగా ఖండించారు. పోలీసుల చర్య ప్రజాస్వామ్యాన్ని అవమానించేలా ఉందని, ప్రతిపక్ష నాయకుల గొంతులను పోలీసులను అడ్డం పెట్టుకుని అణచివేయాలనే ప్రయత్నాలు ప్రభుత్వం మానుకోవాలని హెచ్చరించారు.
సమాజంలో ప్రశ్నించే వారిని భయపెట్టడానికి, పోలీసులు చేసే ఇలాంటి చర్యలు ప్రతిపక్ష నాయకుల్లో మరింత కసిని పెంచుతాయన్నారు. పోలీసులు తక్షణమే అక్రమ అరెస్టులు ఆపాలని, ఇప్పటికే అరెస్టు చేసిన నాయకులను విడుదల చేయాలని ఎంపీ డిమాండ్ చేశారు.
Post Views: 10









