రేపు మణుగూరుకు నలుగురు రాష్ట్ర మంత్రుల రాక..

మంత్రుల పర్యటనను భారీ ఎత్తున విజయవంతం చేయాలి: పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

Today9News ప్రతినిధి,D Ramesh, మణుగూరు

తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళిక, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు తో పాటు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు,, ఉత్తమ్ కుమార్ రెడ్డి లు రేపు (జూలై 16, గురువారం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో పర్యటించనున్నారు. ఒకేసారి నలుగురు అగ్ర మంత్రులు మన ప్రాంతానికి విచ్చేస్తుండటం విశేషం.
ఈ పర్యటనలో భాగంగా మంత్రుల బృందం మన నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీతారామ ప్రాజెక్టు, మారెళ్లపాడు, అలాగే సీతమ్మ బ్యారేజి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. అనంతరం ఈ ప్రాజెక్టుల పురోగతిపై నీటిపారుదల (ఇరిగేషన్) శాఖ అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించి, పనులను మరింత వేగవంతం చేసేందుకు అవసరమైన దిశానిర్దేశం చేయనున్నారు.
ప్రాజెక్టుల పర్యవేక్షణ కోసం నలుగురు మంత్రులు వస్తున్న ఈ పర్యటన మన ప్రాంతానికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది, పినపాక నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అభిమానులు మరియు ప్రజలు అందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి మంత్రులకు ఘన స్వాగతం పలికి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు