పవన్‌కల్యాణ్‌ అభిమాని నిరంజన్ మృతి…

ఆంధ్రప్రదేశ్​ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభిమాని హనుమకొండకు చెందిన పొనుగంటి నిరంజన్ (17) మృతి చెందారు. జన్యుపరమైన అరుదైన వ్యాధితో సతమతమవుతూ, ఎదుగుదల లోపించి మంచానికే పరిమితమైన నిరంజన్‌ను గత నెలలో ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ పరామర్శించారు. ఇటీవల అతడి ఆరోగ్యం మరింత క్షీణించడంతో తల్లిదండ్రులు మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి కన్నుమూశారు. నిరంజన్‌ను కలిసినప్పుడు పవన్‌ కల్యాణ్‌ ఆత్మీయంగా హత్తుకుని బాలుడికి ధైర్యం చెప్పారు. అతడితో సెల్ఫీ కూడా తీసుకున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు