​భద్రాచలం మొబైల్ కోర్టును పునరుద్ధరించాలి:

భద్రాచలం బార్ అసోసియేషన్ డిమాండ్

​భద్రాచలం: భద్రాచలంలోని మొబైల్ కోర్టును రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ. ఆర్.టి. నంబర్ 70ని వెంటనే ఉపసంహరించుకోవాలని భద్రాచలం బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు భద్రాచలం స్థానిక ఎమ్మెల్యే శ్రీ తెల్లం వెంకట్రావు గారికి బార్ అసోసియేషన్ సభ్యులు ఈరోజు వినతిపత్రం సమర్పించారు. అలాగే, ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మరియు రెవెన్యూ శాఖ మంత్రి గారికి కూడా విన్నవించాలని వారు నిర్ణయించారు. దీనితో పాటు, 2019 తర్వాత ఎన్రోల్ అయిన న్యాయవాదులందరికీ ప్రభుత్వం వెంటనే హెల్త్ కార్డులను ఇష్యూ చేయాలని బార్ అసోసియేషన్ ఈ సందర్భంగా స్పష్టం చేసింది.
​ఈ కార్యక్రమంలో భద్రాచలం బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొడాలి శ్రీనివాసన్, ప్రధాన కార్యదర్శి పూసాల శ్రీనివాసాచారి, సంయుక్త కార్యదర్శి తాత లలిత, మాజీ అధ్యక్షులు కోట దేవదానం, సీనియర్ న్యాయవాదులు గోడపర్తి నాగరాజు, రావి రామ్మోహన్, అవులూరి సత్యనారాయణ, కె. అరుణ, నర్మద, పడిసిరి శ్రీనివాసరావు, ఎం.వి. రమణ, విజ్జగిరి రవితేజ,కొత్తపల్లి రాంబాబు గాయత్రి, ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు