ఓటర్లందరూ సర్….మ్యాపింగ్ చేసుకోవాలి.

డివిజన్ ప్రజలకు సూచించిన సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట.

భద్రాచలం మే 22 : టుడే 9 ప్రతినిధి

 భారత ఎన్నికల కమిషన్ చే జారీ చేయబడిన మూడవ దశ సర్.షెడ్యూల్ లో భాగంగా మన తెలంగాణ రాష్ట్రంలో జూన్ 15వ తేదీ నుండి అక్టోబర్ 01 తేదీ వరకు.  సర్.ప్రక్రియ నిర్వహించబడునని 119 (ఎస్ టి) భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి  భద్రాచలం సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట శుక్రవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. 

 ఎన్నికల కమిషన్ ,అలాగే తెలంగాణ సీఈవో ఆదేశాల మేరకు భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయం మీటింగ్ హాల్ నందు పని దినాలలో ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:00 గంటల వరకు భద్రాచలం ఓటర్ల ప్రయోజనార్థం సర్ మ్యాపింగ్ హెల్ప్ డెస్క్ నిర్వహించబడుతున్నదని ఆయన అన్నారు. 

 ఓటర్లందరు తమ ఓటు కార్డు, ఆధార్ కార్డులతో హెల్ప్ డెస్క్ ను సంప్రదించి ఓటర్ మ్యాపింగ్ చేసుకోగలరని ఆయన కోరారు. 

ఇతర వివరములకు హెల్ప్ డెస్క్ ఫోన్ నెంబర్ 08743-232444 ను సంప్రదించాలని సబ్ కలెక్టర్ తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు