*స్థానిక హరిత హోటల్ లో సమన్వయ సమావేశం..
*ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోంది.. బీఆర్ఎస్ నాయకులు…
*ప్రతి కార్యకర్త ప్రజలకు చేరువై ఉండాలని సూచన…
*పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి…
*భవిష్యత్తులో వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే…మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
*ప్రతి గడప గడపకు గులాబీ సభ్యత్వం ఇవ్వాలి…
*జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్న అభివృద్ధి శూన్యం…
*ప్రజా సమస్యలపై పట్టింపు ఉండదు కానీ పబ్లిసిటీ స్టంట్ ఎక్కువ…అంటూ ఎద్దేవా
*ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగురుతుంది…తక్కెళ్లపల రవీందర్
*పార్టీ సమన్వయకర్తలు ఐక్యంగా పనిచేస్తూ సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలి…వద్దిరాజు రవిచంద్ర..
Today9 tv భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి..
స్థానిక హరిత హోటల్ నందు BRS పార్టీ అశ్వరావుపేట, భద్రాచలం నియోజకవర్గాల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి కార్యకర్త ఒక సైన్యంలో పనిచేసే వచ్చే ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతంగా చేయాలని,పార్టీ సభ్యత్వ నమోదు తో ప్రతి గడపన ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ప్రచారం చేయాలని సూచించారు.ఈసారి సభ్యత్వం అంతా డిజిటల్ పద్ధతిలోనే..బూతు స్థాయిలో శిక్షణ శిబిరాలు కూడా ఇస్తామని..2028 నాటికి ఎన్నికల కథన రంగంలో కార్యకర్తలు యుద్ధానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.కార్యకర్తల కష్టం మీద గెలిచి గోడ దూకిన ఎమ్మెల్యే నమ్మకద్రోహం చేశారని..అయినప్పటికీ భద్రాచలం నియోజకవర్గం పార్టీ కార్యకర్తలు నాయకులు బలంగా ఉన్నారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.కాగా అధైర్యపడవద్దని ,వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అంటూ జోస్యం చెప్పారు.. ఎంత గొప్ప వారైనా గడప దాటితే మళ్ళీ తిరిగి వచ్చేది లేదని స్పష్టం చేశారు.
.ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాలు పార్టీ బలోపేతానికి బి ఆర్ ఎస్ కార్యకర్తల సమన్వయ సమావేశం ఏర్పాటు చేయడమైనది అని మాజీ మంత్రి తెలిపారు ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బి ఆర్ ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని ఆయన తెలిపారు. టిఆర్ఎస్ పార్టీ కెసిఆర్ ఆదేశాల మేరకు పార్టీని గ్రామ వార్డు స్థాయి నుంచి పార్టీని సమన్వయ పరుస్తూ బూత్ కమిటీలు వారిగా పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలని పార్టీ కార్యకర్తలను కోరారు
పార్టీ ప్రధాన కార్యదర్శి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జి తక్కెళ్లపల్లి రవీందర్ రావు మాట్లాడుతూ,పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. భవిష్యత్తులో వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే అని చెబుతూ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు. అందుకోసం ప్రతి గడప గడపకు గులాబీ సభ్యత్వం ఇవ్వాలని తెలియజేశారు. కాగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్న అభివృద్ధి శూన్యం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రజా సమస్యలపై పట్టింపు ఉండదు కానీ పబ్లిసిటీ స్టంట్ ఎక్కువ అని ఎద్దేవా చేశారు.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగురుతుంది అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు.
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ,ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బ్రహ్మాండంగా సమావేశాలు జరుగుతున్నాయని..పార్టీ సభ్యత్వం గురించి ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని సూచించారు…బూత్ లెవల్ స్థాయిలో సమావేశాలు పెట్టడం ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేద్దాం అని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో. మాజీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు. మెచ్చ నాగేశ్వరరావులతో పాటు మానే రామకృష్ణ. రావులపల్లి రాంప్రసాద్. ఆకోజి సునీల్. పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.









