తెలంగాణ జనసేనలో గడల శ్రీనివాసరావుకు కీలక బాధ్యతలు…

రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియామకం…

తెలంగాణలో పార్టీ సంస్థాగత బలోపేతంపై ఫోకస్ పెట్టిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ డాక్టర్ గడల శ్రీనివాసరావును రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమించారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ యంత్రాంగాన్ని బలోపేతం చేయడం, నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేయడంలో గడల కీలక పాత్ర పోషించనున్నారు.

ఇది ఇలా ఉంటే గతంలో తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌గా పనిచేసిన గడల శ్రీనివాసరావు 2026 జూన్‌లో జనసేనలో చేరారు. ఇప్పటికే వరంగల్ – ఖమ్మం – నల్గొండ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానానికి జనసేన అభ్యర్థిగా శ్రీనివాసరావును ప్రకటించింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు