కక్షిదారులకు సత్వర న్యాయం అందించడమే లోక్ అదాలత్ లక్ష్యం..
మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ మరియు భద్రాచలంజ్యూడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట క్లాస్ శివనాయక్..
భద్రాచలం, సెప్టెంబర్ 12: TODAY9..
భద్రాచలం జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు మరియు అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ప్రాంగణాల్లో శనివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ శివ నాయక్ మాట్లాడుతూ, లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులకు సత్వర న్యాయం అందించడంతో పాటు సమయం, ఖర్చు ఆదా అవుతుందని అన్నారు. రాజీకి అవకాశం ఉన్న కేసులను ఇరుపక్షాల అంగీకారంతో పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ మంచి వేదిక అని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఏ. దుర్గ భవాని మాట్లాడుతూ, లోక్ అదాలత్‌ల ద్వారా వివాదాలను సఖ్యతతో పరిష్కరించుకోవచ్చని, కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న రాజీకి అవకాశం ఉన్న కేసులను లోక్ అదాలత్‌లో పరిష్కరించుకోవడం ద్వారా కక్షిదారులకు త్వరితగతిన ఉపశమనం లభిస్తుందని తెలిపారు.
భద్రాచలం బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొడాలి శ్రీనివాసన్ మాట్లాడుతూ, లోక్ అదాలత్‌లు ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన న్యాయ వేదికలని, కక్షిదారులు తమ కేసులను రాజీ మార్గంలో పరిష్కరించుకునేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
ఇది ఇలా ఉండగా న్యాయవాదులు కూడా కక్షిదారులకు లోక్ అదాలత్ ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని సూచించారు.భద్రాచలం బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పూసాల శ్రీనివాస చారి మాట్లాడుతూ, లోక్ అదాలత్ ద్వారా కేసుల త్వరిత పరిష్కారం సాధ్యమవుతుందని, కక్షిదారులకు సత్వర న్యాయం అందించడంలో లోక్ అదాలత్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు.
జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా భద్రాచలం జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో జరిమానా కేసులు 74 గాను రూ. 2,50,000 /-, రాజి కేసులు 28, చెక్ బౌన్స్ కేసులు 15, రాజీ కాగా బ్యాంకు కేసులు 27 కు గాను రూ.41,41,600/- మొత్తం బ్యాంకుకు వసూలు అయ్యాయి. అదేవిధంగా అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ కోర్టులో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 890 కి గాను రూ. 1,95,900/-, అలాగే పెట్టి కేసులు 37కు గాను రూ. 6,500/- మొత్తం వసూలు అయ్యాయి.
కక్షి దారుల సౌకర్యార్థం రోటరీ క్లబ్ ఆఫ్ భద్రాచలం మరియు భద్రాచలం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రోటరీ అధ్యక్షులు ఎస్.కె అజీమ్, ప్రధాన కార్యదర్శి పి రాజేష్, కోశాధికారి కొత్త రామకృష్ణ కక్షి దారులకు అల్పాహారం పంపిణీ చేశారు. అదేవిధంగా శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో కక్షిదారులకు పులిహోర ప్యాకెట్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో భద్రాచలం బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొడాలి శ్రీనివాసన్, ప్రధాన కార్యదర్శి పూసాల శ్రీనివాసాచారి చారి, సంయుక్త కార్యదర్శి తాత లలిత, కోశాధికారి దన్నాన రాము, లేడీ రిప్రజెంటివ్ తరుణి, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యుటర్, భద్రాచలం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ మేనేజర్ సిబ్బంది, లోక్ అదాలత్ మెంబర్స్ రావి రామ్మోహన్, పి భాస్కరరావు, సీనియర్ న్యాయవాదులు పేరాల వెంకటేశ్వర్లు, పేరాల నాగరాజు, ముత్యాల కిషోర్, పల్లపు మస్తాన్ బాబు, పరిషిక సోమరాజు, బండారు అరుణ్ చంద్, కె అరుణ శ్రీ, పామరాజు తిరుమలరావు, అవులూరి సత్యనారాయణ, ఎం.వి.రమ, సాధన పల్లి సతీష్, ఎస్. నర్మద, సింగారం మల్లేష్, బి. శారద, బీవీ కార్తీక్, కారం రమేష్, వర్ధన్, రాజేష్, కొత్తపల్లి రాంబాబు కోరాడ శ్రీనివాస్ , అరవింద్, చల్లా శివకృష్ణ, చందన, మధు తదితర న్యాయవాదులు మరియు కక్షిదారులు పాల్గొన్నారు









