BRICS సదస్సులో ప్రధాని మోడీ క్రేజ్!!

దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో భారత ప్రధాని మోదీ కి ప్రపంచ దేశాల్లో ఉన్న క్రేజ్ ఆసక్తిని కలిగించింది.

దిల్లీ వేదికగా జరుగుతోన్న బ్రిక్స్‌ సమావేశంలో ఒక ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. ప్రపంచ దేశాల అధినేతల మధ్య భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న ఆదరణ మరోసారి స్పష్టమైంది. బ్రిక్స్‌ బిజినెస్‌ ఫోరమ్‌లో పాల్గొన్న పలువురు విదేశీ ప్రతినిధులు.. మోదీతో ఫొటో దిగేందుకు ఆసక్తి చూపించారు. ఈ సదస్సు ప్రాంగణంలో ప్రధాని నడుచుకుంటూ వస్తుండగా ఆయన వద్దకు వచ్చి.. ‘సర్‌, ప్లీజ్‌.. మేం మీతో ఒక ఫొటో దిగొచ్చా?’ అని కోరారు. దానికి ప్రధాని చిరునవ్వుతో ‘ఎస్‌.. తప్పకుండా’ అంటూ వారితో ఫొటో దిగారు. అదే సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్‌ పెజెష్కియాన్‌.. మోదీకి దారి ఇస్తూ పక్కకు తప్పుకున్నారు.


ఫొటో దిగుతున్న సమయంలో మహిళా ప్రతినిధులు స్పందిస్తూ.. ‘మీతో ఫొటో దిగే అవకాశం లభించడం నిజంగా మా అదృష్టం’ అని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను భాజపా అస్సాం.. తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో పంచుకోగా ప్రస్తుతం అది నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు