భద్రాద్రి జిల్లా నడి బొడ్డున విజయవంతమైన బీసీల ధర్మపోరాట దీక్ష…

Today9News ప్రతినిధి, D రమేష్, మణుగూరు..


భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగినటువంటి బి.సి.ల ధర్మ పోరాట దీక్ష , జాతీయ అధ్యక్షులు జాజుల శీనన్న పిలుపుమేరకు కులక చర్ల శ్రీనివాసు ముదిరాజ్ ఆదేశాలతో, జిల్లాలో చేపట్టిన దీక్ష విజయవంతం అయ్యిందని బీసీ సంఘం నాయకులు ఒక ప్రకటనలో తెలియజేశారు ,

కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జనగణలలో భాగంగా, జన గణనతో పాటు కుల గణన కూడా చేయాలని దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి బీ.సీ కులానికి కొలమానం ప్రకారం ఒక యూనిక్ కోడ్ కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు, ఆ కోడ్ప్ర కారమే బీసీల లెక్క పూర్తిగా తేలుతుందని, ఆ లెక్క ప్రకారం బీ.సీలకు రావలసిన రిజర్వేషన్ల కోటా వస్తుందని, ఆ రిజర్వేషన్ల వలన బీ.సీ బిడ్డలకు చదువు, ఉద్యోగాలతో పాటు రాజకీయ రిజర్వేషన్లు కూడా బీ.సీలకు దక్కుతాయని భావిస్తూ, ఆ క్రమంలో శుక్రవారం నాడు ఈ ధర్మ పోరాట దీక్ష జిల్లాల పరంగా చేయడం జరిగిందని తెలియజేశారు .

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఈ దీక్షలో జిల్లా అధ్యక్షులు పామర్తి ప్రసాద్ అకివీడు, రెండు జిల్లాల ఇన్చార్జి రాష్ట్ర కార్యదర్శి, బుర్ర సోమేశ్వర్ గౌడ్ అధీనంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొడగాని శ్రీనివాస్ యాదవ్, మాద శ్రీరాములు, భద్రాచలం బీసీ సంఘం నాయకులు శ్రీ బొలిశెట్టి రంగారావు, మల్లెల రామనాథం,శంకర్ ఎస్సీ సెల్ నాయకులు, మరియు మహిళా నాయకురాలు బాచెట్టి కవిత, బత్తుల సుజాత, భోగా లక్ష్మి, రాయల పద్మ, విజయలక్ష్మి, రాజేశ్వరి, ఎస్సీ జాను తదితరులు ఈ దీక్షలో పాల్గొని విజయవంత చేసారు…

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు