అసెంబ్లీ సమావేశం లైవ్
శాసన సభలో హాట్ హాట్ చర్చ….
తెలంగాణ అసెంబ్లీలో వాడి వేడి చర్చలు కొనసాగుతున్నాయి. బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు నిన్న జరిగిన సంఘటనపై స్పందిస్తూ ఒకింత ఉద్రేకానికి లోనయ్యారు. మాజీ హోంమంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే అయినా సబితా ఇంద్రారెడ్డి పై మగ పోలీసులు దాడి చేశారంటూ ఆరోపించారు మరో మహిళా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పై సైతం దాడి చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తే తిరిగి వారి పైన కేసులు ఎలా నమోదు చేస్తారంటూ ప్రశ్నించారు గౌరవ శాసనసభ కౌరవసభల మారింది అని అభివర్ణించారు.
సబితా ఇంద్రారెడ్డి మీద దాడి చేసి, మగ పోలీసులు ఆమె గొంతు పిసికారని, సునీతా లక్ష్మారెడ్డి చీర లాగితే ఆమె కన్నీళ్లు పెట్టుకునే దృశ్యం మనమందరం చూసామన్నారు.కాగా ఇప్పటి వరకు దాని మీద విచారణ జరగలేదన్నారు.హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ఫిర్యాదు చేస్తే.. తిరిగి సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవ లక్ష్మిపై కేసు నమోదు చేశారని ఆక్రోశం వెళ్ళగక్కారు.ఈ గౌరవ సభ కౌరవ సభగా మారింది.. కలియుగ దుశ్శాసనుడిలా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడుఆనాడు కౌరవులకు పట్టిన గతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పడుతుందని హరీష్ రావు అన్నారు.
ఇందుకు స్పీకర్ ప్రసాద్ కుమార్ హరీష్ రావు ఎందుకు అంత ఆవేశం వ్యక్తం చేస్తున్నారు. మీ శాసనసభ్యులు నా తల్లిని అన్నారు. మీ చెల్లిని కాదు కదా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది అంటూ ఘాటుగా స్పందించారు.
మొత్తానికి వాడి వేడి చర్చలతో ఈరోజు అసెంబ్లీ సమావేశం కొనసాగుతోంది.
— Telangana Congress (@INCTelangana) September 8, 2026









