తాతా మధును కాపాడుకునేందుకు బీఆర్ఎస్ విప్ వ్యూహం రచిస్తున్నట్టు తెలియవచ్చింది.స్పీకర్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తాతా మధుపై సస్పెన్షన్ లేదా అనర్హత తీర్మానానికి కాంగ్రెస్ సిద్ధమవుతోంది.
ప్రభుత్వం ప్రవేశపెట్టే క్రమశిక్షణా తీర్మానాన్ని మండలిలో ఓటింగ్ ద్వారా ఓడించి, తాతా మధుపై చర్యలు పడకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా బీఆర్ఎస్ అధిష్ఠానం వ్యూహరచన చేసింది.
కాగా 40 స్థానాలున్న శాసనమండలిలో బీఆర్ఎస్‌కు 17 మంది ఎమ్మెల్సీల బలం ఉండగా, కాంగ్రెస్‌కు 13, బీజేపీకి 3, ఎంఐఎంకు 2, ఇతరులకు 4 స్థానాలున్నాయి.
మండలిలో తమకున్న 17 మంది ఎమ్మెల్సీల సంఖ్యాబలంతో తీర్మానాన్ని వీగిపోయేలా చేసి కాంగ్రెస్ సర్కార్‌ను ఒత్తిడిలోకి నెట్టాలని గులాబీ దళం ప్రణాళికలు రచిస్తోంది.
ఓటింగ్‌కు ఎవరైనా ఎమ్మెల్సీలు గైర్హాజరైతే ప్రమాదమని గుర్తించిన బీఆర్ఎస్, తమ సభ్యులందరినీ ఏకతాటిపై ఉంచేందుకు త్రీ-లైన్ విప్ అస్త్రాన్ని ప్రయోగించింది. తాతా మధుపై క్రమశిక్షణా చర్యలకు కాంగ్రెస్ పట్టుబడుతుండగా, తాతా మధును కాపాడుకోవడానికి బి ఆర్ ఎస్ ప్రయత్నిస్తుంది మొత్తానికి అసెంబ్లీ, మండలి సమావేశాల్లో వాడి వేడి చర్చలు, వ్యూహ, ప్రతి వ్యూహాలు చోటుచేసుకొనున్నాయి









