భద్రాచలం అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక కృషి: ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు
భద్రాచలం, ఆగస్టు 29: TODAY9..
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయ ప్రాంగణంలోని గోదావరి కరకట్ట ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల మరియు ఆయకట్టు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సుమారు రూ.46 కోట్ల వ్యయంతో గోదావరి పుష్కరాల కోసం పుష్కర ఘాట్ల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భద్రాచలం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ హాజరై కొబ్బరికాయ కొట్టి ఘాట్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ.. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయం, గోదావరి కరకట్ట ప్రాంత అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోందని తెలిపారు.
భద్రాచలం రామాలయ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , జిల్లా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , తుమ్మల నాగేశ్వరరావు , ఇన్చార్జి మంత్రి వాకిటి శ్రీహరి లకు ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
భక్తుల సౌకర్యార్థం పుష్కర ఘాట్ల నిర్మాణం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, భవిష్యత్లో భద్రాచలానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ బాలస్వామి లక్ష్మీనారాయణ , శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయ కార్యనిర్వహణ అధికారి దామోదర్ , తెలంగాణ రాష్ట్ర పెరిక కార్పొరేషన్ వైస్ చైర్మన్ బుడగం శ్రీనివాస్ , భద్రాచలం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పూనెం కృష్ణ , పార్టీ నాయకులు భోగాల శ్రీనివాస్ రెడ్డి, రత్నం రమాకాంత్, చింతిర్యాల రవికుమార్, నర్రా రాము, భీమవరపు వెంకటరెడ్డి, గాడి విజయ్, వార్డు సభ్యులు చెంచు సుబ్బారావు, బొంత రమణ, బండారు శరత్, కావూరి గోపి, భూక్యా సుశీల, కారం దుర్గారావు, ఇలమల అశోక్, సున్నం ఈశ్వరి, సున్నం భూలక్ష్మి, ఇర్ఫా అనసూయ, యూత్ నాయకులు మాచినేని భాను తదితరులు పాల్గొన్నారు.









