వైరాలో సాగునీరు విడుదలకై అఖిలపక్షం ఆధ్వర్యంలో మహా ధర్నా

•సాగునీరు విడుదల చేయాలని ఎస్సై పుష్పాల రామారావు కాళ్లు పట్టుకున్న వృద్ధ రైతు…

•ఎట్టకేలకు సాగునీటిని విడుదల చేసిన అధికారులు

ఆగస్టు17….

వైరా నియోజకవర్గ పట్టణ పారుదల శాఖ కార్యాలయం సోమవారం రైతులు పెద్ద సంఖ్యలో అఖిలపక్షం ఆధ్వర్యంలో బి ఆర్ఎస్, సిపిఎం, మాస్ లైన్ ధర్నాలో పాల్గొని నినాదాలతో మార్మోగింది . వైరా రిజర్వాయర్ నుండి ఆయకట్టు పరిధిలోని రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేసుకుంటూ ధర్నా నిర్వహించారు..

.నీటి పారుదల కార్యాలయానికి వస్తున్న డి. ఈ నాగ బ్రహ్మయ్యను రైతులు సాగునీరు అందించాలని కోరగా, పై అధికారుల నుండి తమకు సాగునీరు విడుదల చేయాలని ఎలాంటి స్పష్టమైన ఆదేశాలు లేవని చెప్పటంతో రైతులు ఆగ్రహించారు. అప్పటికే అక్కడికి చేరుకున్న ఎస్ ఐ రామారావు రైతులతో మాట్లాడతామని ప్రకటించి డి. ఈ నాగ బ్రహ్మయ్యను కార్యాలయంలో తీసుకు వెళ్లారు. అనంతరం పలువురు అధికారులతో మాట్లాడి కొనసాధికారులు ఆదేశాల మేరకే సాగునీరు విడుదల చేస్తామని తెలపటంతో రైతులు ధర్నా ను కొనసాగించారు.

రైతులతో ఎస్సై పుష్పాలరామారావు మాట్లాడుతుండగా తల్లాడ మండలం , కుర్నవల్లి గ్రామానికి చెందిన బోడేపూడి మాధవరావు అనే రైతు వైరా మండల లింగన్నపాలెం రెవెన్యూ పరిధిలో ఐదు ఎకరాల్లో తాను వరి సాగు చేశానని ఇప్పటికే ఎకరాకు 15000 ఖర్చు చేశానని, సాగునీరు విడుదల చేయకపోతే తనకు చావే శరణ్యం అంటూ ఎలాగైనా సాగునీరు విడుదల చేయాలని ఎస్సై పుష్పాల రామారావు కాళ్ళపై పడ్డాడు.

ఎట్టకేలకు అధికారులతో మాట్లాడి న డి.ఈ నాగ బ్రహ్మయ్య పుష్పాల రామారావు సమక్షంలో అఖిలపక్ష నాయకులకు చర్చలు జరిపి తక్షణమే సాగునీటిని విడుదల చేసేందుకు అంగీకరించి అక్కడ ఉండి సాగునీటిని కుడి కాలువ నుండి విడుదల చేయటంతో, ధర్నాలో పాల్గొన్న రైతులు హర్షం వ్యక్తం చేశారు .

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ జిల్లా నాయకులు కట్టా కృష్ణార్జున రావు, బాణాల వెంకటేశ్వరరావు, సిపిఎం డివిజన్ కార్యదర్శి భూక్య వీరభద్ర, మాశలై కార్యదర్శి షేక్ నాగుల్ మీరా, షేక్ లాల్ మియా, అహ్మద్ శంకరా, సుధాకర్, మద్దెల రవి, అప్పం సురేష్, మరికంటి శివ ఎదునూరి శ్రీనివాస్, ఆదోని ప్రేమ్ కుమార్, వేముల శివకృష్ణ, గుజ్జర్లపూడి దేవరాజ్, నాగేశ్వరరావు,ఓంకార్, రజిత, కోసూరి రామకృష్ణ, కిరణ్, మోదుగు పెద్ద వెంకటేశ్వర్లు,, వేల్పుల మంగయ్య, పఠాన్, కరిముల్లా, బట్టు, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు