డీజీపీ చేత మణుగూరు పోలీస్ స్టేషన్ నూతన భవనం ప్రారంభం…

నేరాల నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ.. డిజిపి..

  • సరిహద్దుల్లో విస్తృతమైన నిఘా
  • మాదకద్రవ్యాల నియంత్రణకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తున్నాం
  • హోంగార్డు నుండి డీజిపి వరకు పటిష్టమైన వ్యవస్థ ఏర్పాటు

మణుగూరు పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద ప్రధాన రహదారి ప్రక్కన నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన డిజిపి సివి ఆనంద్ కు ఐజి చంద్రశేఖర్ రెడ్డి, కలెక్టర్ అంకిత్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ స్థానిక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఘనంగా స్వాగతం పలికారు… . పోలీస్ స్టేషన్ ప్రారంభించిన అనంతరం కొద్దిసేపు డిజిపి స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా వ్యవహరించారు.

మణుగూరు నూతన పోలీస్ స్టేషన్లో కొద్ది సేపు స్టేషన్ ఆఫీసర్ గా డిజిపి.

 
మణుగూరు నూతన పోలీస్ స్టేషన్ ను ప్రారంభించిన అనంతరం డిజిపి స్టేషన్లో, స్టేషన్ ఆఫీసర్ గా రికార్డులపై సైన్ చేశారు. మణుగూరు నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవంలో భాగంగా స్టేషన్ ఆఫీసర్ సిఐ నాగబాబులను,ఎంపీ బలరాం నాయక్, శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, ఐజి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా ఎస్పీ రోహిత్ రాజులు అభినందించారు.

నిధుల కొరతతో మధ్యలోనే నిలిచిన పోలీస్ స్టేషన్ భవనాన్ని జిల్లా ఎస్పీ చొరవతో ప్రారంభించాం.. డిజిపి సివి ఆనంద్..

నూతన స్టేషన్ ను ప్రారంభించిన అనంతరం డిజిపి మీడియాతో మాట్లాడుతూ,నిధుల కొరత సమస్యతో నిలిచిన మణుగూరు పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ప్రత్యేక చొరవతో స్థానిక సింగరేణి సంస్థ తోడ్పాటు, ప్రజల సంపూర్ణ సహకారంతో పోలీస్ స్టేషన్ ప్రారంభించుకున్నామని డిజిపి సివి ఆనంద్ అన్నారు.

 ఇది ఇలా ఉంటే మాదక ద్రవ్యాల సమస్యను పోలీస్ శాఖ తీవ్రంగా పరిగణిస్తుందన్నారు డిజిపి, ప్రజా శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని భవిష్యత్ తరాల కోసం కార్యచరణ ఏర్పాటు చేసి కఠినంగా వ్యవహరిస్తూ చర్యలు చేపడుతున్నామని వివరించారు.నేరాల నియంత్రణకు ఎలాగైతే ప్రత్యేక టీములు ఉన్నాయో అదేవిధంగా గంజాయి తదితర మాదకద్రవ్యాల నియంత్రణకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు డిజిపి వివరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకోసం కొంత కఠినంగా వ్యవహరించక తప్పదని డిజిపి తెలియజేశారు.


మాదకద్రవ్యాలను అరికట్టేందుకు  ఈగల్ అనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి డ్రగ్స్ రమణా అరికట్టేందుకు, హోంగార్డు నుండి డిజిపి వరకు పటిష్టమైన వ్యవస్థ ద్వారా పోరాటం సాగిస్తున్నామని తెలియజేశారు..ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు పోలీస్ సిబ్బంది రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు