కన్నెపల్లి పంప్ హౌస్ మోటర్లు ఆన్ చేయండి, ఏ ఒక్క బ్యారేజ్‌కు ఏం జరిగినా మా బీఆర్ఎస్ పార్టీనే రద్దు చేసుకుంటామని సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి.
కన్నెపల్లి పంప్ హౌస్ మోటర్లు ఆన్ చేస్తే సూపర్ ఎల్‌నినో నుండి రాష్ట్రాన్ని రక్షించవచ్చన్నారు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి.NDSA రిపోర్ట్ నిజమైతే SLBC లో 8 మంది కార్మికుల ప్రాణాలు బలైనందుకు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలను జైళ్లో వేసి ఉండేవారన్నారు.కాగా తప్పు జరిగిందని నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటామన్నారు.కన్నెపల్లి పంప్ హౌస్ మోటర్లు ఆన్ చేస్తే సూపర్ ఎల్‌నినో నుండి రాష్ట్రాన్ని రక్షించవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.మా బీఆర్ఎస్ నాయకుల కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శనపై నలుగురు మంత్రులు స్పందించారని,కాగా ఒక్కరు కూడా తెలంగాణ బిడ్డలం అన్న సోయితో మాట్లాడలేదుఅదే సొల్లు, బూతు పురాణం మాట్లాడారని విమర్శించారు జగదీశ్ రెడ్డి.ప్రాణహిత నది గోదావరిలో కలిసే ప్రదేశంలోనే నీళ్లు అందుబాటులో ఉంటాయి, అందువల్ల అక్కడే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని తెలియజేశారు.







