డిజిటల్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు మోసాల బారిన పడే ఖాతాదారులకు శుభ‌వార్త చెప్పిన ఆర్బీఐ….

డిజిటల్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు మోసాల బారిన పడే ఖాతాదారులకు ఆర్బీఐ శుభ‌వార్త చెప్పింది.సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతే, కేవలం 5 రోజుల్లోనే ఆ మొత్తాన్ని బ్యాంకులు ఖాతాదారుడి అకౌంట్‌లో జమ చేయాలని ఆదేశించింది.ఈమేరకు బ్యాంక్ వైపు లోపాలుంటే, ఖాతాదారుడు ఫిర్యాదు చేయకపోయినా సరే పూర్తి సొమ్మును బ్యాంకే వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది కాగా థర్డ్ పార్టీ హ్యాకింగ్ వల్ల మోసం జరిగితే, 5 రోజుల్లోపు ఫిర్యాదు చేస్తే ఖాతాదారుడికి ఎలాంటి బాధ్యత ఉండదని,. OTP లేదా పాస్‌వర్డ్స్ షేర్ చేయడం వల్ల నష్టపోతే మాత్రం వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆర్ బీ ఐ తేల్చి చెప్పింది…అయితే ఈ కొత్త నిబంధనలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.మొదటిసారి రూ.50,000 లోపు నష్టపోయిన వారికి, జీవితంలో ఒక్కసారి మాత్రమే ఈ ప్రత్యేక సదుపాయం వర్తిస్తుంది…

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share