1.20 కోట్ల రూపాయలతో 15 నూతన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు..

కార్యక్రమంలో పాల్గొన్న మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు….

భద్రాచలం పట్టణంలోని ప్రజలకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందించాలనే లక్ష్యంతో సోమవారం ఉదయం భద్రాచలంలోని పలు ప్రాంతాల్లో నూతన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ , స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు , భద్రాచలం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పూనెం కృష్ణ , ఉపసర్పంచ్ రత్నం కవిత , వార్డు సభ్యులతో కలిసి ప్రారంభించారు.

సుభాష్ నగర్ కాలనీ, మెడికల్ కాలనీ, ఐటిడిఎ రోడ్, సెంట్ పాల్స్ స్కూల్ సమీపం, వెంకటేశ్వర కాలనీ, రాజుపేట కాలనీల్లో లో వోల్టేజ్ ప్రాబ్లంని గ్రహించి 15 నూతన ట్రాన్స్‌ఫార్మర్లను విద్యుత్ శాఖ అధికారులు ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులను బలోపేతం చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో భద్రాచలం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పూనెం కృష్ణ , ఉపసర్పంచ్ రత్నం కవిత , వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు రత్నం రమాకాంత్, నర్రా రాము, భీమవరపు వెంకటరెడ్డి, పెద్దినేని శ్రీనివాస్, దారపునేని రాంబాబు, కొప్పుల శ్రీను, యూత్ నాయకులు గాడి విజయ్, మహిళ నాయకురాలు, అభిమానులు, విద్యుత్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు