సిపిఐ భద్రాద్రి జిల్లా కార్యదర్శి ఎస్.కే. సాబీర్ పాషా…
కొత్తగూడెం:, జులై 05 (TODAY9) :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చుంచుపల్లి మండలం, ప్రశాంతినగర్ గ్రామపంచాయతీ లో ఆదివారం పర్యటించిన అనంతరం జరిగిన సమావేశంలో సిపిఐ భద్రాద్రి జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఉండేందుకు ఇల్లు, ఇంటి స్థలం కోసం రాష్ట్ర రాజధానికి దండుగా కదులుదాం అని పిలుపునిచ్చారు.

చలో హైదరాబాద్, సెక్రటేరియట్ ముట్టడిని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరారు. ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేసుకున్న పేదల ఇండ్ల కూల్చివేతలను వెంటనే విరమించుకోవాలని, పేదలు నిర్మించుకున్న ఇండ్లకు ఇంటి నెంబర్లు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిరుపేదల సొంతింటి కల నెరవేర్చే వరకు పోరాటాలు ఆగవని, భూమి, ఇండ్ల సమస్యల పరిష్కారం కోసం పేదలంతా ఐక్యంగా కదలాలని అన్నారు.
Post Views: 6









