ఒవైసీ కాలేజ్ నిర్మాణాలపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది.సల్కం చెరువులో ఉన్న ఒవైసీ విద్యాసంస్థల నిర్మాణాలపై నివేదిక ఇవ్వాలని ఏప్రిల్ 13వ తేదీన ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. కాగా ఈ విషయంలో ఇప్పటివరకు ఎలాంటి వివరణ రాకపోవడంతో న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.అన్ని శాఖలు నివేదిక ఇస్తేనే చర్యలు తీసుకుంటామని హైడ్రా చెప్పడంతో హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.తమకు సంబంధం లేదని హెచ్ఎండీఏ, SIR ప్రక్రియలో బిజీగా ఉన్నామని మరో నాలుగు వారాల సమయం ఇవ్వాలని జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులు స్కెచ్ ఇవ్వలేదని నీటి పారుదల శాఖ, మరో వారం సమయం కావాలని విద్యా శాఖ తెలపడం పట్ల హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.చివరిగా మరో వారం గడువు ఇస్తున్నామని, ఈలోగా నివేదికలు అందజేయకపోతే తామే తగిన చర్యలకు ఆదేశాలు ఇస్తామని హైకోర్టు హెచ్చరించింది..
Post Views: 13









