విద్యార్థుల ఎఫ్ ఆర్ ఎస్, ఎం డి ఎం వివరాలను 10 గంటల లోపు ఆప్ లో నమోదు చేయాల్సిందే

అన్నపురెడ్డిపల్లి మండల విద్యాశాఖ అధికారి ఉండేటి ఆనందకుమార్..


భద్రాద్రి కొత్తగూడెం, జులై 03 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అన్నపురెడ్డిపల్లి మండలంలోని అన్ని విద్యాసంస్థల ప్రధానోపాధ్యాయుల సమావేశం శుక్రవారం మండల విద్యా వనరుల కేంద్రంలో నిర్వహించారు. మండల విద్యాశాఖ అధికారి ఉండేటి ఆనందకుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విద్యాశాఖలో వస్తున్న మార్పులను గురించి చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ… ఎఫ్ ఆర్ ఎస్, ఎం డి ఎం లను సంబంధిత యాప్లలో ఉదయం 10 గంటల లోపే నమోదు చేయాలని తెలియజేశారు. అలాగే ఉపాధ్యాయుల హాజరును కూడా తప్పకుండా నమోదు చేసుకోవాలని, సెలవు వివరాలను ముందుగా నమోదు చేయాలని తెలిపారు. పాఠశాలల్లో విద్యార్థుల నమోదు, నిలకడ స్థాయి పెంచాలని అన్నపురెడ్డిపల్లి కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు అంగోతు వెంకటేశ్వరరావు అన్నారు. ఈసారి బేస్ లైన్ టెస్ట్ ఆన్లైన్లో నిర్వహించాల్సి ఉంటుందని తెలియజేశారు. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడానికి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కృషి చేయాలని, నాణ్యమైన విద్యను అందించాలని వివరించారు . ఈ సమావేశంలో అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సిసివో మరియు సిఆర్పి లు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share