కోదాడ, జూలై 5(TODAY9):
తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర సహాయ కార్యదర్శిగా కోదాడకు చెందిన అనుబత్తుల వేణు నియమితులయ్యారు. చౌటుప్పల్‌లో ఆదివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి సహకార సభ్యుల సమావేశంలో చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు వీరమోహన్ ముఖ్యఅతిథిగా హాజరై వేణుకు నియామక పత్రాన్ని అందజేశారు. కోదాడ పద్మశాలి సంఘం అధ్యక్షుడు గొర్రె రాజేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా రాపోలు వీరమోహన్ మాట్లాడుతూ చేనేత కార్మికుల సంక్షేమానికి, ఐక్యతకు కొత్తగా ఎన్నికైన కమిటీ సభ్యులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు కొంగరి నరసింహారావు, రుద్ర నాగలక్ష్మి మరియు సంఘ ప్రతినిధులు, సహకార సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Post Views: 10









