3 రాష్ట్రాల సీఎంలను కలిపిన ‘తుంగభద్ర’.. కొత్త గేట్లు ప్రారంభం…

ఒకే ఫ్రేమ్‌లో CBN, రేవంత్, డీకే శివ కుమార్

తుంగభద్ర ప్రాజెక్టు 33 కొత్త క్రస్ట్ గేట్ల ప్రారంభోత్సవం సందర్భంగా కర్ణాటకలోని హోస్పేటలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. కేంద్ర మంత్రి సి.ఆర్. పాటిల్‌తో కలిసి ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం డీకే శివకుమార్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అంతర్రాష్ట్ర జల వివాదాలు, ప్రాజెక్టుల నిర్వహణపై ముగ్గురు ముఖ్యమంత్రులు కీలక చర్చలు జరిపారు.

కర్ణాటక, AP, తెలంగాణలకు కీలకమైన తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభోత్సవం హోస్పేట్‌లో ఘనంగా జరిగింది. కర్ణాటక సీఎం డీకే, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్, కేంద్ర మంత్రి పాటిల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరూ ఆత్మీయంగా పలకరించుకున్నారు. కాగా 2024లో వరద ప్రవాహానికి 19వ గేటు కొట్టుకుపోగా, స్టాప్ లాక్ గేటు అమర్చారు. డ్యామ్ భద్రత దృష్ట్యా నిపుణుల సూచనతో ₹51Crతో 33 గేట్లను KA, AP ఏర్పాటుచేశాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share