ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా బీఎల్ఏల జాబితా సమర్పించిన బీజేపీ

భద్రాచలం, జూన్ 24:

భారత ఎన్నికల సంఘం జూన్ 25 నుండి ప్రారంభించనున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం (Special Intensive Revision – SIR)లో భాగంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) భద్రాచలం నియోజకవర్గానికి సంబంధించిన బూత్ లెవెల్ ఏజెంట్ల (బీఎల్ఏ) జాబితాను బుధవారం నాడు భద్రాచలంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో అసిస్టెంట్ ఎలక్షన్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (AERO) కోట రవికుమార్ కు పార్టీ నాయకులు అందజేశారు.

ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా కొత్త ఓటర్ల నమోదు, వివరాల మార్పులు, అభ్యంతరాల పరిశీలన, అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా ఎన్నికల సంఘం చేపట్టనున్న కార్యక్రమాలకు సహకరించే ఉద్దేశ్యంతో పార్టీ తరఫున నియమించిన బీఎల్ఏల వివరాలను అధికారికంగా సమర్పించినట్లు నాయకులు తెలిపారు. ప్రజలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఓటరు వివరాలను పరిశీలించుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో భద్రాచలం నియోజకవర్గ బీజేపీ బీఎల్ఏ ఇంచార్జీ కుంజా సంతోష్, బీజేపీ నాయకులు ములిశెట్టి రాంమోహన్ రావు, అల్లాడి వెంకటేశ్వరరావు, చెల్లుబోయిన వెంకన్న, బోడ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు