కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో ముసలం పుట్టింది.కొత్త క్యాబినెట్ ఏర్పాటు అయిన రెండు రోజులకే, ఇరిగేషన్ శాఖా మంత్రి రామలింగారెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేయటం కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది.
కర్ణాటక లో డీకే శివకుమార్ నేతృత్వంలో కొత్త క్యాబినెట్ కొలువు దేరి రెండు రోజులు అవుతున్న సంగతి తెలిసిందే.. కాగా శాఖల కేటాయింపులపై రామలింగారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం.బెంగళూరు నగర అభివృద్ధి శాఖ ఆశించిన రామలింగారెడ్డి అభిప్రాయానికి వ్యతిరేకంగా ,డీకే శివకుమార్ఇ రిగేషన్ శాఖను కేటాయించటంతో మనస్తాపానికి గురైన రామలింగారెడ్డి తనకు ఇష్టం లేని శాఖకు మంత్రిగా కొనసాగలేక రాజీనామా చేశారని తెలుస్తోంది.
ఇది ఇలా ఉంటే మరి కొందరు ఎమ్మెల్యేలే కాకుండా, సిద్ధరామయ్య క్యాబినెట్ లో మంత్రి పదవులు నిర్వహించి డీకే శివకుమార్ మంత్రి వర్గంలో చోటు లభించని వారు సైతం లోలోపల అసంతృప్తి వ్యక్త పరుస్తున్నట్టు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.. అలుకతో మంత్రి పదవికి రాజీనామా చేసిన ఆయనను బుజ్జగించి కొనసాగిస్తారా? రాజీనామాను ఆమోదిస్తారా? అనేది వేచి చూడాల్సిందే. అయితే రామలింగారెడ్డి రాజీనామా వెనుక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అనేది తెలియాల్సి ఉంది..









