భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో. జూన్ 1:
టుడే 9 ప్రతినిధి
సుదూర ఆదివాసి గిరిజన గ్రామాల నుండి గిరిజన దర్బార్ లో దరఖాస్తులు చేసుకొన్న గిరిజనులకు అర్హులైన ప్రతి గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు అందే విధంగా యూనిట్ అధికారులు కృషి చేయాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ సంబంధిత అధికారులకు ఆదేశించారు.
సోమవారం నాడు ఐటిడిఏ సమావేశ మందిరంలో వివిధ సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజనుల నుండి ఆయన యూనిట్ అధికారుల సమక్షంలో అర్జీలు స్వీకరించి సంబంధిత అధికారులకు పంపుతూ వీలైనంత తొందరగా అర్హులైన ప్రతి గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా ప్రవేశ పెట్టే సంక్షేమ పథకాలు అందించడానికి కృషి చేయాలని ఆయన అన్నారు. ఈరోజు గిరిజనులు గిరిజన దర్బార్ లో సమర్పించిన అర్జీలలో పొడు భూముల పట్టాలలో పేర్లు మార్పు కొరకు, రైతుబంధు రుణాల కొరకు, వ్యక్తిగత సమస్యలు, భూ సమస్యలు మరియు గిరిజన గ్రామాలలో వ్యవసాయం చేసుకోవడానికి కరెంటు, బోరు, మోటారు కొరకు మారుమూల గిరిజన గ్రామాలలో మంచినీటి సౌకర్యం కల్పించుట కొరకు, నూతనంగా మత్స్యకార సొసైటీలు ఏర్పాటు చేసుకొనుట కొరకు, దీర్ఘకాలిక జబ్బులకు వైద్యం చేయించుకోవడానికి ఆర్థిక సహాయం ఇప్పించుట కొరకు, స్వయం ఉపాధి ద్వారా జీవనోపాధి పెంపొందించుకోవడానికి శిక్షణలు ఇప్పించుట కొరకు, ఇతర ఆర్థిక ప్రయోజనాలు కల్పించుట కొరకు, కుటుంబాన్ని పోషించుకోవడానికి డైలీ వేజ్ వర్కర్ గా అవకాశం కల్పించడం కొరకు, గురుకుల పాఠశాలల్లో సీట్లు ఇప్పించుట కొరకు, సోలార్ ద్వారా విద్యుత్ సౌకర్యం కల్పించుట కొరకు, తమ పొలాలలో బోర్లు తవ్వించుకోవడానికి అనుమతి కొరకు, గిరిజనులు అర్జీలు సమర్పించారని ఆయన అన్నారు.
గిరిజన దర్బార్ లో సమర్పించిన అర్జీలు అన్ని ఆన్లైన్ ద్వారా ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి విడతల వారీగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడానికి కృషి చేస్తామని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, ఎస్ డి సి ఆనంద కుమార్, ఈ ఈ ట్రైబల్ వెల్ఫేర్ మధుకర్, ఎఫ్ డి సి ఉదయ్ కుమార్, కొండరెడ్ల అధికారి గన్యా, ఏపీఓ పవర్ వేణు, ఏడిఎంహెచ్ఓ సైదులు, ఎల్ టి ఆర్ డి టి మనిధర్, డి ఎం జిసిసి సమ్మయ్య, మిషన్ భగీరథ ఏ ఈ ఈ నారాయణరావు, ఆర్ సి ఓ గురుకులం అరుణకుమారి, జేడీఎం హరికృష్ణ, ఏవో సున్నం రాంబాబు, మేనేజర్ ఆదినారాయణ, ఐసిడిఎస్ సూపర్వైజర్ అనసూయ, హౌసింగ్ ఏఈ హేమంత్ ఇతర శాఖల సిబ్బంది మబ్బు ప్రసాద్, నరేందర్, వెంకటేశ్వర్లు, సుప్పల్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 22









