ధాన్యం కొనుగోలుపై ఒకరి మీద ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారా?
రాష్ట్రం లో ధాన్యం కొనుగోలు జాప్యం విషయంలో సీనియర్ మంత్రి వైఫల్యమంటున్న ఆ పార్టీ ముఖ్యనేత మాటలతో విభేదించిన సీనియర్ మంత్రి ఆగ్రహం వ్యక్తపరుస్తూ,సీనియర్ నేత కదా అని స్వేచ్ఛ ఇస్తే ఇలా చేస్తారా అంటూ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా, గన్నీ బ్యాగుల కొరత తీర్చకుండా.. పాత ధాన్యం గోదాముల్లోనే నిల్వపెట్టి కొత్త ధాన్యం కొనాలంటే ఎలా అంటూ పార్టీ ముఖ్యనేతను ఎదురు ప్రశ్న ను సీనియర్ మంత్రి సంధించినట్టు తెలియవచ్చింది.ఈ దిశగా అధిష్టానానికి ఒకరిపై మరొకరు లేఖలు పంపారని ప్రచారం సాగుతోంది. నిధులు లేకుండా ఉత్త కొనుగోలు కేంద్రాలతో ధాన్యం ఎలా కొనాలని ..సదరు మంత్రి అధిష్ఠానానికి రాసిన లేఖలో ఆవేదన వ్యక్తం చేసినట్టు పార్టీ వర్గాల్లో మాటలు వినిపిస్తున్నాయి.
140 లక్షల టన్నుల ధాన్యం పండితే.. అందులో సగం ధాన్యమే కొనుగోలు చేయాలని ఆదేశాలు ఇచ్చారు మరి మిగిలిన ధాన్యాన్ని ఏం చేయాలి? అని లేఖలో ప్రస్తావన చేసినట్టు బోగట్టా. సీనియర్ మంత్రి కదా అని స్వేచ్ఛ ఇచ్చానని..అన్నీ ఆయనే చూసుకుంటారనే ఆలోచనతో తాను ఆ శాఖను పట్టించుకోలేదంటున్న ముఖ్యనేత తాను ఏమైనా సలహాలు, సూచనలిచ్చినా.తన శాఖలో వేలు పెడుతున్నారంటూ అంటారని అధిష్టానానికి రాసిన లేఖలో ఫిర్యాదు చేసినట్టు సమాచారం…









