పాత కారులో ‘ఆయిల్ లెస్’ చికెన్.. గుంటూరు యువత సరికొత్త ట్రెండ్!
ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాల కోసం ఆశపడకుండా, గుంటూరు యువకులు స్వయం ఉపాధితో రాణిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు..
గుంటూరుకు చెందిన యువకులు ఉన్నత చదువులు చదివారు. ఆ చదువుకు తగ్గ ఉద్యోగం లభించలేదని నిరాశ చెందలేదు. తమ మదిలో మెదిలిన ఆలోచనకు ఒక రూపాన్ని ఇవ్వాలని భావించారు. అందుకు అనుగుణంగా ఒక పాత కారును తీసుకొని వెనుక భాగం లో బొగ్గులతో నడిచే పొయ్యిని ఏర్పాటుచేసి మొబైల్ హోటల్ గా మార్చారు. వివరాల్లోకి వెళితే…ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాల కోసం ఆశపడకుండా, గుంటూరు యువకులు స్వయం ఉపాధితో రాణిస్తున్నారు. ఒక పాత కారును వినూత్నంగా మార్చి మొబైల్ ఫుడ్ కోర్ట్‌గా మార్చారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపే వారి కోసం బొగ్గుల పొయ్యిపై కాల్చిన ‘ఆయిల్ లెస్ చికెన్ స్నాక్స్’ అందిస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు. వీరి వినూత్న వ్యాపార ఆలోచన ప్రస్తుతం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది.









