రాజీనామా ప్రకటించిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య…

బిగ్ బ్రేకింగ్ న్యూస్

సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా

బ్రేక్ ఫాస్ట్ మీటింగ్‌లో వెల్లడించిన సిద్ధరామయ్య సీఎం సిద్ధరామయ్యకు పాదాభివందనం చేసిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్

డీకే శివకుమార్‌ను ఆలింగనం చేసుకున్న సిద్ధరామయ్య

డీకే శివకుమార్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పిన సిద్ధ రామయ్య

రాజీనామా సమర్పించేందుకు గవర్నర్ అపాయింట్మెంట్ కోరిన సిద్ధరామయ్య…

కర్ణాటక రాజకీయాల్లో అందరూ ఊహించినట్టుగానే ముఖ్యమంత్రి మార్పుకు రంగం సిద్ధమైంది… గత కొద్దిరోజులుగా ఊపొందుకుంటున్న ఊహాగానాలకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రాజీనామాతో తెరపడనుంది . రెండు రోజుల క్రితం హుటాహుటిన సిద్ధరామయ్య ఢిల్లీకి వెళ్లి అధిష్టానంతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఢిల్లీలో అధిష్టానంతో జరిగిన భేటీ అనంతరం ఒంటరిగా కర్ణాటకకు వచ్చిన సిద్ధరామయ్య, తన కేబినెట్ మంత్రులతో సమావేశం అయ్యారు. కాగా డిప్యూటీ సీఎం డికే శివకుమార్ ఢిల్లీలోనే ఉండటం గమనార్హం.

ఇలా ఉంటే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తన రాజీనామాను ప్రకటించారు. బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ తర్వాత సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయనున్నారు.మధ్యాహ్నం 3 గంటల తర్వాత సిద్ధరామయ్యరాజీనామాను సమర్పించనున్నారు.

బ్రేక్‌ఫాస్ట్‌ మీటింగ్‌ లో..డీకే శివకుమార్ సిద్ధరామయ్య కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. తాను రాజీనామా చేస్తున్న క్రమంలోనే మంత్రులందరినీ తన నివాసంలో సీఎం అల్పాహార విందు ఇచ్చారు. ఆ విందుకు హాజరైన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సిద్ధరామయ్య కాళ్లకు నమస్కరించడం గమనార్హం.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు