తప్పిపోయిన వ్యక్తిని గుర్తించిన ఆటో డ్రైవర్.

పోలీసులకు అప్పగింత...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో: భద్రాచలం: ఏప్రిల్ 15 :టుడే 9 ప్రతినిధి

భద్రాచలం పోలీస్ స్టేషన్ లో తప్పిపోయిన వ్యక్తి గురించి పిర్యాదు ఇవ్వగా వెంటనే స్పందించిన భద్రాచలం యస్ ఐ . జి, స్వప్న ఈ నెల12 న కేసు నమోదు చేసి, తప్పిపోయిన వ్యక్తి వివరాలను ఫోటో తో పాటుగా స్థానిక ప్రెస్, లోకల్ వాట్స్ అప్ గ్రూప్ లలో పంపి, తప్పిపోయిన వ్యక్తి గురించి విచారణ చేస్తున్న క్రమంలో మంగళ వారం నాడు పిచుకలపాడు ప్రాంతానికి చెందిన బనోత్ ఆనంద్ అనే ఆటో డ్రైవర్ భద్రాచలంలోని రాజుపేట కాలనీలో ఆటో నడుపుతుండగా ఒక వ్యక్తి అటు వైపుగా నడుచుకుంటూ వెళుతుండగా ఆటో డ్రైవర్ భద్రచలం లోకల్ వాట్స్ అప్ గ్రూప్ లలో వచ్చిన తప్పిపోయిన వ్యక్తి ఫోటో ను చూసి, ఆ ఫోటో లో ఉన్న వ్యక్తి అతనే అని గుర్తించి వెంటనే భద్రాచలం పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించి తప్పిపోయిన వ్యక్తిని తన ఆటో లో తీసుకొని భద్రాచలం పోలీస్ స్టేషన్ తీసుకొని రాగా, సదరు ఆటో డ్రైవర్ చేసిన మంచి పనికి గాను భద్రాచలం ఇన్స్పెక్టర్ నాగరాజు , ఎస్ ఐ . జి, స్వప్న సదరు ఆటో డ్రైవర్ ను అబినందించి అతనికి కొంత నగదు పురస్కారం ఇవ్వడం జరిగింది. ఇతనిలాగే అందరు కూడా పోలీస్ వారికీ సహకరించాలని,అలా సహకరించిన ప్రతి ఒక్కరికి తగిన పురస్కారం ఇవ్వడం జరుగుతుందని భద్రాచలం యస్ ఐ జి, స్వప్న తెలిపినారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share