మేడారం జాతరను జయప్రదం చేయండి…పిలుపునిచ్చిన మంత్రి సీతక్క..
వేములవాడ రాజన్నను మంత్రి సీతక్క తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం కోడెను కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జనవరి 19న మేడారంలో సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా జరగనున్న సమ్మక్క-సారలమ్మ గద్దెల పునః ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమా అగర్వాల్ పాల్గొన్నారు.
Post Views: 26







