“సెప్టెంబర్ 30న సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి భారీ సభ నిర్వహించనున్నారు.సెప్టెంబర్ 30న సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనే బహిరంగ సభను లక్ష మందితో నిర్వహించనున్నట్లు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తె లిపారు.
ఇది ఇలా ఉండగా సీఎం సభ ప్రకటనతో బీఆర్‌ఎస్‌లో ఆందోళన మొదలైందని ఆది శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. కేటీఆర్ రాజకీయ పతనం సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభమవుతుందని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జోస్యం చెప్పారు.
కాగా ఆ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సభ ద్వారా ప్రజలకు వివరించనున్నట్లు తెలిపారు. చేనేత రంగానికి గత ప్రభుత్వం వదిలిన బకాయిలను చెల్లించడంతో పాటు చీరలు, పాఠశాల యూనిఫామ్‌లకు ఆర్డర్లు ఇచ్చామని వెల్లడించారు ఎమ్మెల్యే .
బీఆర్‌ఎస్ పాలనలో ఫామ్‌హౌస్‌ల సంస్కృతి పెరిగిందని ఆది శ్రీనివాస్ ఆరోపించారు. 22-ఏ జాబితాలో ఉన్న అర్హులైన పేదలకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.









