హఫీజ్‌పేట్‌లో మహిళ జుట్టు పట్టుకుని లాగిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్..

హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ సమీపంలోని నూర్ మసీదు, ఆదిత్యనగర్ వద్ద శుక్రవారం రాత్రి ఓ మహిళను ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ లాఠీతో కొట్టి, జుట్టు పట్టుకుని లాగినట్లు ఆరోపణలు వచ్చాయి.

ఘటనకు సంబంధించినదిగా చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహిళ దుర్భాషలాడుతూ అనుచితంగా ప్రవర్తించడంతో ఘర్షణ జరిగినట్లు స్థానికుల నుంచి సమాచారం. మహిళపై ఆర్పీఎఫ్ సిబ్బంది బలప్రయోగం చేశారనే ఆరోపణలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపి, ఆరోపణలు నిజమైతే చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్‌లో మహిళపై దాడి హోంగార్డుపై చర్యలు..

హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్‌లో ఓ మహిళపై పోలీసు సిబ్బంది దాడి చేసి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లినట్లు కనిపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.. ఘటనపై విచారణ చేపట్టిన దక్షిణ మధ్య రైల్వే సంబంధిత వ్యక్తిని తెలంగాణ పోలీస్ హోంగార్డుగా గుర్తించింది. రైల్వే స్టేషన్‌లో విధుల కోసం అతడిని డిప్యుటేషన్‌పై నియమించినట్లు వెల్లడించింది.

క్రమశిక్షణ చర్యల కోసం హోంగార్డును తిరిగి తెలంగాణ పోలీస్ శాఖకు పంపినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఘటనకు దారితీసిన పరిస్థితులు, తదుపరి చర్యలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు