హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా.. దానం నాగేందర్..


  • ఉపఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధం
  • ఎన్నికల్లో కొట్లడానికే సిద్ధం
  • సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన లేదన్న దానం నాగేందర్..
  • త్వరలోనే ఖైరతాబాద్ ఉప ఎన్నిక ?

Sept 18…TODAY 9…

ఎమ్మెల్యే పదవిపై అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయస్థానం వెలువరించిన తీర్పును తాను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. శనివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, రాజకీయంగా ప్రజాక్షేత్రంలోనే తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.

 హైకోర్టు తీర్పుపై పైకోర్టుకు వెళ్తారనే ప్రచారానికి దానం నాగేందర్ ముగింపు పలికారు. "ఈ తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించే ఆలోచన నాకు ఏమాత్రం లేదు. చట్టసభలు, న్యాయస్థానాల కంటే ప్రజల మద్దతే నాకు ముఖ్యం. న్యాయపోరాటాల కంటే నేరుగా ఎన్నికల బరిలోనే నా సత్తా చాటుతాను" అని ఆయన కుండబద్దలు కొట్టారు. 

ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉపఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాను పోటీ చేయడానికి పూర్తి సన్నద్ధంగా ఉన్నానని దానం తెలిపారు.కాగా తనకు రాజకీయాలు, ఎన్నికలు, పోరాటాలు కొత్తేమీ కాదు. ఎన్నో కష్టనష్టాలు, రాజకీయ ఒడిదొడుకులు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చానన్నారు . యుద్ధానికి తను ఎప్పుడూ వెనుకాడనని . ప్రజాబలంతో మళ్లీ పోటీ చేసి, ఘన విజయం సాధించి తీరుతానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరం లేదని, ఇప్పటి నుంచే ప్రజాక్షేత్రంలోకి వెళ్లి సమరానికి సిద్ధం కావాలని దానం నాగేందర్ పిలుపునిచ్చారు.

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై హైకోర్టు అనర్హత వేటు వేసినప్పటికీ, కాంగ్రెస్ వైపు వెళ్లిన మిగిలిన 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం పూర్తిగా సేఫ్ జోన్‌లోనే ఉన్నారు.అయితే దానం నాగేందర్ కాంగ్రెస్ ‘బి-ఫామ్’పై సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయడమే పార్టీ ఫిరాయింపునకు తిరుగులేని చట్టపరమైన ఆధారంగా మారింది.

మిగిలిన 8 మంది ఎమ్మెల్యేలు అధికారికంగా కాంగ్రెస్‌లో చేరినట్లు ఎలాంటి పత్రాలు గానీ, వేరే పార్టీ బి-ఫామ్‌లు గానీ దాఖలు చేయలేదు. కేవలం కండువాలు కప్పుకోవడం, ఫోటోలు, పేపర్ క్లిప్పింగులు మాత్రమే కోర్టుల్లో చట్టబద్ధమైన ఫిరాయింపు సాక్ష్యాలుగా నిలబడవని సుప్రీంకోర్టు తీర్పులు స్పష్టం చేస్తున్నాయి.

అసెంబ్లీ రికార్డుల్లో వారంతా ఇప్పటికీ బీఆర్ఎస్ సభ్యులుగానే ఉన్నారు. దీంతో బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తున్నప్పటికీ, మిగిలిన 9 మంది ఎమ్మెల్యేల సభ్యత్వాలకు తక్షణమే ఎలాంటి న్యాయపరమైన ముప్పు లేదని న్యాయనిపుణులు అంచనా వేస్తున్నారు…

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు