దమ్మపేట సెప్టెంబర్ 9: TODAY 9:
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు ప్రాణహాని కలిగించే కుట్ర జరిగిందంటూ దమ్మపేట పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ శ్రేణులు ఫిర్యాదు చేశారు. జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఆదేశాల మేరకు, నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు సూచనలతో ఎస్ఐ బాలస్వామికి ఫిర్యాదును ఆ పార్టీ నాయకులు అందజేశారు.
అసెంబ్లీలో జరిగిన పరిణామాలు, షాద్‌నగర్ ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్ చేసిన వ్యాఖ్యలు, ఎర్రవల్లి ఫామ్‌హౌస్ వైపు కాంగ్రెస్ పార్టీకి చెందినవారు పెద్ద సంఖ్యలో చేరుకున్న అంశాలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు, వేధింపులు జరుగుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గాజుబోయిన యేసుబాబు, దారా యుగుందర్, అబ్దుల్ జిన్నా, యట్ల రామదాసు, దారా రాము, ఉయ్యాల లక్ష్మీనారాయణ, బుడే, వెలుగోటి మహేష్, పాకనాటి శ్రీను, కాసిని శ్రీను తదితరులు పాల్గొన్నారు.









