మహిళా శాసనసభ్యులపై జరిగిన దాడిని , ఆధారాలతో సహా గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళాం …. కేటీఆర్

మాపై జరిగిన దాడిని, ముఖ్యంగా మహిళా శాసనసభ్యులపై జరిగిన దాడిని ఫోటోలు, ఆధారాలతో సహా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివరించారు .గవర్నర్‌ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

గవర్నర్ ఈరోజు మాకు సమయం ఇచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేశామన్నారు .ఆయన ఈమధ్యనే అనారోగ్యానికి గురైన నేపథ్యంలో, ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేశామన్నారు . కేసీఆర్ ఆదేశాల మేరకు ఈరోజు గవర్నర్ ను కలిశామన్నారు .

1000 హామీలతో అధికారంలోకి వచ్చి, 1000 రోజుల నుంచి అన్ని రకాల హామీలను విఫలం చేయడంతో పాటు, పరిపాలనలోనూ పూర్తిగా విఫలమైన తీరును గవర్నర్ కు వివరించామన్నారు . కాంగ్రెస్ 1000 రోజుల పాలనలో ప్రజలు ఎన్ని బాధలు పడుతున్నారో ఆయనకు తెలియజేశామన్నారు . రాష్ట్రంలోని రైతన్నలు ఎదుర్కొంటున్న కష్టాలను గురించి వివరించామన్నారు .

ఇది ఇలా ఉంటే రాష్ట్రంలోని నిరుద్యోగ విద్యార్థులు, యువతను రాహుల్ గాంధీ ఏ విధంగా మోసం చేశారో గవర్నర్ కు తెలియజేశామని .- రాష్ట్రంలోని పాలిటెక్నిక్ విద్యార్థులు చేస్తున్న ఆందోళన, వారి డిమాండ్లను వివరించామని మీడియాకు తెలియజేశారు.

మొన్న శాసనసభ సమావేశాల మొదటి రోజు తమ పైన ప్రభుత్వ ఆధ్వర్యంలో పోలీసులు చేసిన దాష్టీకాన్ని వివరించామన్నారు. రాహుల్ గాంధీ పార్లమెంటులో నిరసన తెలిపిన తీరులోనే, టీ-షర్ట్ల ద్వారా నిరసన తెలపాలని తమ పార్టీ నిర్ణయించిందని గవర్నర్ కు వివరించామన్నారు .

అయితే తమ హక్కులను కాలరాస్తూ, శాసనసభ్యులైన తమను సభలోకి రానివ్వకుండా రోడ్డుపైనే అడ్డుకున్న తీరును గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లామని వివరించారు .

మహిళా నాయకురాలు సునితా లక్ష్మారెడ్డి చీరను లాగి దుశ్శాసన పర్వానికి తెరలేపిన తీరును, తమ పార్టీ శాసనసభ్యులపై దాడి చేసి, తిరిగి బి ఆర్ ఎస్ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ కుట్రను వివరించామన్నారు .

భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులతో పాటు అందరిపైనా దాడి చేయడానికి వెళ్లిన పోలీసులపై ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని గవర్నర్ కు తెలియజేశామని చెప్పారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు