•దళితుల ప్రాణాలు అంటే లెక్క లేదా అంటూ మృతుల బందువుల ఆవేదన…
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో లేని కారణంగా యాక్సిడెంట్ లో మృతి చెందిన మృతదేహాలకు పోస్టుమార్టం జరపకపోవడంతో మృతుల తరపున బంధువులు ఆందోళనకు సిద్ధపడ్డారు.యాక్సిడెంట్లో మృతి చెందిన ఇద్దరి మృతదేహాలకు పోస్ట్మార్టం చేయడానికి వైద్యులు అందుబాటులో లేరు అంటూ ఆవేదన చెందారు.
ఉదయం 10:30 లకు యాక్సిడెంట్ జరిగితే రాత్రి 8 అయినా వారికి పోస్ట్మార్టం చేయడానికి జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో డాక్టర్స్ లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో డ్యూటీ డాక్టర్, సూపరింటెండెంట్, ఆర్ఎంవో ఎవ్వరు డాక్టర్లు అందుబాటులో లేక పోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు.
ఇది ఇలా ఉంటే సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం సజ్జాపూర్ గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు డీసీఎం ఓనర్ నుండి నష్ట పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట జాతీయ రహదారి మరియు పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట బంధువులు ధర్నా చేపట్టారు. దీంతో రోడ్డుపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. కాగా కోహిర్ ఎస్ఐ యాక్సిడెంట్ చేసిన వాళ్ళపై కేసు కూడా తీసుకోవడం లేదని బాధితులు వాపోయారు.దళితుల ప్రాణాలు అంటే లెక్క లేదా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కోహిర్ ఎస్ఐ పై వెంటనే చర్యలు తీసుకోవాలని బాధితులు జహీరాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు.









