వైరా నియోజకవర్గ పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం నూతనంగా ఎన్నికైన మండల పట్టణ అధ్యక్షులు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైరా నియోజకవర్గ శాసనసభ్యులు రామదాస్ నాయక్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ, సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు పాల్గొని నూతనంగా ఏర్పడ్డ మండల పట్టణ అధ్యక్షులకు నియామక పత్రాలను అందజేశారు . వైరా మండల అధ్యక్షులుగా శీలం చంద్రశేఖర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులుగా పేరంశెట్టి సీతారాములు, కొనిజర్ల మండల అధ్యక్షులు సవల్ల నాగేశ్వరరావు, ఏనుకూరు మండల అధ్యక్షులు స్వర్ణ శిరీష, కారేపల్లి మండల అధ్యక్షులు తోటకూర రాంబాబు, తదితరులకు బాధ్యతలు అప్పగించారు…
Post Views: 11









