GV Mall ప్రారంభోత్సవంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు…

భద్రాచలం: ఆగస్ట్ 01: D వినేష్ డివిజన్ ప్రతినిధి….

భద్రాచలం పట్టణంలోని యూబీ రోడ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన GV Mall ప్రారంభోత్సవ కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి మాల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా GV Mall అధినేత ఉమామహేశ్వరరావుకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్రారంభోత్సవ వేడుకల్లో ప్రముఖ టీవీ సీరియల్ నటి దీపిక రంగరాజు పాల్గొని సందడి చేశారు. ఆమెను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. అనంతరం సందర్శకులు GV Mall‌లో షాపింగ్ చేస్తూ ప్రారంభోత్సవ వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ, భద్రాచలం పట్టణంలో ఆధునిక షాపింగ్ మాల్స్ ఏర్పాటు కావడం పట్టణ అభివృద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. ఇటువంటి వ్యాపార సంస్థల ఏర్పాటుతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు పట్టణ వాణిజ్య రంగం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో భద్రాచలం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పూనెం కృష్ణ , ఉపసర్పంచ్ రత్నం కవిత , వార్డు సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, యువ నాయకులు, పట్టణ ప్రముఖులు, పెద్ద సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు