Today9News ప్రతినిధి,D రమేష్, మణుగూరు
వాసవి క్లబ్ శివాలయం స్ట్రీట్ ప్రెసిడెంట్ మారెమళ్ళ రామకృష్ణ ఆధ్వర్యంలో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ సేవారత్న అవార్డు గ్రహీత Vn silver kcgf కడవెండి విశ్వనాథ్ గుప్తా పుట్టినరోజు సందర్భంగా…..
స్థానిక నాయుడుపేటలో గల వాసవి వృద్ధాశ్రమం నందు 50 మంది వృద్ధులకు అన్నదానము ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఒక నిరుపేద కుటుంబానికి వారికి కావలసిన నిత్యవసర సరుకులను వారు అందజేసి దాతృత్వం చాటారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రస్తుత సమాజంలో ఆకలితో ఇబ్బంది పడుతున్నటువంటి నిరుపేదలకు వారి వారి పుట్టిన రోజులకు మరియు పెళ్లి రోజులకు ఇలాంటి కార్యక్రమాలు చేయడంలో అందరూ ముందుకు రావాలని అభ్యర్థించారు.. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గోల్డెన్ కేసీజీఫ్ వాసవిధాత VC ఇంటర్నేషనల్ డైరెక్టర్ గుమ్మడవెల్లి శ్రీనివాస్, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ మాశెట్టి వరప్రసాద్ ,బూర్ల పుల్లారావు , కురువెళ్ళ గోపాలకృష్ణమూర్తి పాల్గొన్నారు. వాసవి క్లబ్ శివాలయం ప్రెసిడెంట్ మారెమల్ల రామకృష్ణ,సెక్రటరీ శ్రీహరి, ట్రెజరర్ కురువల్ల గోపాలకృష్ణమూర్తి, వైస్ ప్రెసిడెంట్ వల్లాల యుగంధర్ ముఖ్య సలహాదారు నాళ్ల భాను వ్యవహరించారు.









