కొత్తగూడెం , జులై 06 (TODAY9) :
భారత దేశ వ్యాప్తంగా జరిగే అతిపెద్ద ఆన్లైన్ పరీక్ష అయిన విద్యార్ధి విజ్ఞాన్ మంథన్ కరపత్రం ను సోమవారం విద్యా శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శంభు ప్రసాద్ తన కార్యాలయములో ఆవిష్కరించారు. విద్యార్థుల్లో నిక్షిప్తమై ఉన్న శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మకత, పరిశోధనా సామర్థ్యాలను వెలికితీసి, వాటిని మరింత మెరుగుపరిచేందుకు ‘విద్యార్థి విజ్ఞాన్ మంథన్’(వి.వి.ఎం) ఊయోగపడుతుందని అన్నారు. విద్యార్ధులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమం లో ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ ఎస్.మాధవరావు, అకాడమిక్ మానిటరింగ్ అధికారి తోట మాధవరావు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల కో ఆర్డినేటర్ ఆనంద కుమార్ పాల్గొన్నారు.
Post Views: 6









